ఆస్తిపన్ను తగ్గింపు విషయంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ చొరవ తీసుకున్నారని, ఆయన కృషితోనే ఆస్తి ...
{పజలను తప్పుదోవ పట్టించడం సరికాదు
టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మార్నేని వెంకన్న
మహబూబాబాద్ : ఆస్తిపన్ను తగ్గింపు విషయంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ చొరవ తీసుకున్నారని, ఆయన కృషితోనే ఆస్తి పన్ను తగ్గిందని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మార్నేని వెంకన్న అన్నారు. స్థానిక టీఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెక్షన్ 81 ప్రకారం ఆస్తిపన్ను తగ్గే అవకాశం ఉందని సూచించినందునే మున్సిపాలిటీలో తీర్మాణం చేసి ఆస్తిపన్నును తగ్గించినట్లు చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సీడీఎంఏతో మాట్లాడి మాట్లాడినట్లు గుర్తు చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులు ఎమ్మెల్యేను హేళన చేసే విధంగా మాట్లాడడం సరికాదని సూచించారు. కొన్ని పార్టీల నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం ఎమ్మెల్యేను బదనాం చేయడం సరికాదన్నారు.
అందరి సమష్టి కృషితోనే చివరికి ఆస్తిపన్ను తగ్గించుకోగలిగామన్నారు. వార్డు కౌన్సిలర్ ఫరీద్ మాట్లాడుతూ.. ఆదాయం పెంచాలనే ఉద్దేశ్యంతో అధికారులు తీర్మానం ప్రవేశపెట్టడం, చైర్‌పర్సన్ అవగాహనలోపంతోనే ఆస్తిపన్నుపై తీర్మానం చేసినట్లు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కన్న, చౌడవరపు రంగన్న, పొనుగోటి రామకృష్ణారావు, నిమ్మల శ్రీనివాస్, భూక్య ప్రవీణ్, తూము వెంకన్న, ఆదిల్, చిట్యాల జనార్ధన్, పోతురాజు, చాంద్, ఎక్బాల్, నీలేష్‌రాయ్, కమలాకర్, చెట్ల జయశ్రీ, ఇబ్రహీం, పెద్దబోయిన కృష్ణ, కొండ భిక్షం, తదితరులు పాల్గొన్నారు.