బిడ్డా.. ఎక్కడున్నావ్ రా! | Missing child in Valigonda | Sakshi
Sakshi News home page

బిడ్డా.. ఎక్కడున్నావ్ రా!

Jul 31 2015 12:17 AM | Updated on Sep 3 2017 6:27 AM

మాటలురాని బిడ్డ మూడురోజులనుంచి కనిపించకుండా పోయాడు. ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడోనని ఆ తల్లి ఆరాటం అంతాఇంతాకాదు.

తప్పిపోయిన బిడ్డ కోసం తల్లి ఆరాటం
వలిగొండ : మాటలురాని బిడ్డ మూడురోజులనుంచి కనిపించకుండా పోయాడు. ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడోనని ఆ తల్లి ఆరాటం అంతాఇంతాకాదు. మండలకేంద్రంలోని జంగాలకాలనీలో ఉండే మోతే సారంగం, విజయ దంపతులు భవన నిర్మాణ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి  నలుగురు కుమారులుండగా పెద్ద కుమారుడు రవీందర్ (15)కు పుట్టుకతో మాటలు రావు. వారికున్న ఆర్థిక పరిస్థితిని బట్టి అతడిని పాఠశాలలో చేర్పించకుండా ఇంటి వద్దనే కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఇటీవలే వలిగొండలో ఏర్పాటు చేసిన వికలాంగుల కేంద్రానికి పంపించడానికి ఏర్పాట్లు చేశారు. అది ఇష్టంలేని రవీందర్ మంగళవారం మధ్యాహ్నం  నుంచి కనిపించకుండా పోయాడు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లోను ఫిర్యాదు చేసినా ఇంత వరకు కనిపించలేదు. మాటలు రాని బిడ్డ ఎక్కడకు వెళ్లాడో..ఏ ఊరో చెప్పలేని, రాయలేని కొడుకు ఏం తిన్నాడోనని తల్లి వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. ఎవరికైనా ఆచూకీ లభిస్తే 8499836185, 9848808713 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement