ఆత్మహత్యలు ఆపడమే లక్ష్యం | Minister Harish Rao comments on Farmer suicides | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యలు ఆపడమే లక్ష్యం

Jan 11 2017 2:25 AM | Updated on Oct 1 2018 2:36 PM

ఆత్మహత్యలు ఆపడమే లక్ష్యం - Sakshi

ఆత్మహత్యలు ఆపడమే లక్ష్యం

రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఆపడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య మని భారీ నీటిపారుదల శాఖ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.

భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు

ఆదిలాబాద్‌ టౌన్‌: రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఆపడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య మని భారీ నీటిపారుదల శాఖ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కందు ల కొనుగోళ్లను ప్రారంభించారు. క్వింటా లుకు రూ. 5,050 మద్దతు ధర నిర్ణయిం చారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ ద్వారా కందులు కొనుగోలు చేశారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునే వారిని తరిమికొట్టాలని రైతులకు పిలుపు నిచ్చారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నతో కలసి తాంసి మండలం మత్తడి వాగు ప్రాజెక్టు కుడి కాల్వ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్, ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యేలు రాథోడ్‌ బాపురావు, కోనేరు కోనప్ప, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా మంత్రులు వెళ్లగానే కొను గోళ్లు నిలిచిపోయాయి. సాయంత్రం 4గంట లకు కొనుగోళ్లు ప్రారంభించగా.. 5 గంట లకు తేమ శాతాన్ని మార్కెటింగ్‌ అధికారులు పరిశీలించారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, ఎండబెడితేనే కొనుగోలు చేస్తా మన్నారు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. రాత్రి 7.30 గంటల వరకూ కొనుగోళ్లు ప్రారంభించ లేదు. మార్కెట్‌ చైర్మన్‌ రాజన్న వచ్చి కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.

రైతు కష్టాలను తీరుస్తున్నాం: రైతుల కష్టాలను తీరుస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలు స్తోందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఎత్తి పోత ల పథకం నీటిని తానిమడుగు వద్ద గల డెలి వరీ సిస్టర్న్‌ నుంచి కడెం ప్రధాన కాల్వలోకి మంత్రి జోగు రామన్నతో కలసి మంగళ వారం విడుదల చేశారు. ప్రభుత్వ విప్‌ నల్లా ఓదేలు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌ రావు, దుర్గం చిన్నయ్య  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement