తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీల పాలన పుణ్యమేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు.
కొండపాక (మెదక్) : తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీల పాలన పుణ్యమేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల్లో కాలువల ద్వారా సాగు నీటి రంగానికి చుక్క నీరు రాని జిల్లా కేవలం మెదక్ మాత్రమేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి గోదావరి జలాలతో వ్యవసాయ రంగానికి సాగు నీరు, తాగు నీరు అందించే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారన్నారు.