స్కూళ్లు ఎప్పటినుంచి ప్రారంభిద్దాం?

MHRD Asked All State Education Departments When Parents Want Schools To Start - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాఠశాలలను ఎప్పటినుంచి ప్రారంభించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారో రాష్ట్రాల వారీగా అభిప్రాయాలను తెలియజేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) అన్ని రాష్ట్రాల విద్యాశాఖ లను కోరింది. ఈ మేరకు ఎంహెచ్‌ఆర్‌డీ అండర్‌ సెక్రటరీ రాజేశ్‌ సాంప్లే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు. స్కూళ్లను ఆగస్టు/సెప్టెంబర్‌/అక్టోబర్‌ నెలల్లో ఏ నెలలో ప్రారంభిస్తే బాగుంటుందో తెలియజేయాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో కూడా తెలపాలని, ఇతరత్రా అంశాలు ఏమైనా ఉంటే కూడా ఈనెల 20లోగా చెప్పాలని సూచించారు. ఆ వివరాలను తమ మెయిల్‌ ఐడీకి (coordinationeel @gmail.com లేదా  rsamplay. edu@nic.in) పంపించాలని వెల్లడించారు.

అయితే ఈనెల 15న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో స్కూల్‌ సేఫ్టీ ప్లాన్‌పై ఎంహెచ్‌ఆర్‌డీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. అందులో పాఠశాలల ప్రారంభంపై కూడా అభిప్రాయాలను తీసుకుంది. అయితే ఆ తరువాత మూడు రోజులకే మళ్లీ అభిప్రాయాలను తెలియజేయాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ కార్యదర్శులకు ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈనెల 15న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల ప్రారంభ తేదీలను ఇంకా నిర్ణయించలేదని 17 రాష్ట్రాలు వెల్లడించాయి.

అందులో అండమాన్‌ నికోబార్, ఛత్తీస్‌గఢ్, డయ్యూ డామన్, గోవా, గుజరాత్, లక్షద్వీప్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరాం, ఒడిషా, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఉన్నా యి. ఐదు రాష్ట్రాలు మాత్రం కేంద్రం జారీ చేసే ఆదేశాల మేరకు ప్రారంభిస్తామని వెల్లడించాయి. అందులో హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు ఉన్నా యి. ఇక మరో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తేదీలను, నెలలను నిర్ణయించినట్లు వెల్లడించాయి. అందులో సెప్టెంబర్‌ 5న స్కూళ్ల ను ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్, ఆగస్టు తరువాత ప్రారంభిస్తామని అరుణాచల్‌ ప్రదేశ్‌ వెల్లడించాయి. అస్సాం (జూలై 31న), బిహార్‌ (ఆగ స్టు 15న), చండీగఢ్‌ (ఆగస్టు 15 తరువాత), ఢిల్లీ (ఆగస్టులో), హరియాణా (ఆగస్టు 15), కర్ణాటక (సెప్టెంబర్‌ 1 తరువాత), కేరళ, లఢక్‌ (ఆగస్టు 31 తరువాత), మణిపూర్‌ (సెప్టెంబర్‌ 1న), నాగాలాండ్‌ (సెప్టెంబర్‌ మొదటివారం), పాండి చ్చేరి (జూలై 31 తరువాత), రాజస్తాన్‌ సెప్టెంబ ర్‌లో స్కూళ్లను ప్రారంభిస్తామని వెల్లడించాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top