డబ్బుల కోసం అమృత డ్రామాలాడుతోంది..

Maruthi Rao Brother Sravan Condemns Amrutha Allegations - Sakshi

సాక్షి, మిర్యాలగూడ : తనపై అమృత చేసిన ఆరోపణలను మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ ఖండించారు. డబ్బు కోసమే అమృత డ్రామాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. శ్రవణ్‌ సోమవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘అమృత తీరు మమ్మల్ని ఎంతో బాధించింది. నేను మా అన్నయను బెదిరించానని ఆరోపిస్తోంది. నా వల్ల ప్రాణహాని ఉందనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇక ప్రణయ్‌ హత్యకేసులో నా ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. (బాబాయ్ చాలాసార్లు రెచ్చగొట్టాడు: అమృత)

మా అన్న మారుతీరావు చనిపోయే వరకూ ఉరి తీయాలని అమృత డిమాండ్‌ చేసింది. ఇప్పుడు అడ్డమైన ఆరోపణలు చేస్తోంది. ప్రణయ్‌ హత్యకు ముందు మా అన్నకు నాకు మాటలు లేవు. అమృత విషయంలోనే గొడవలు జరిగాయి. ఆమె చేసిన చెత్త పనికే ఇవన్నీ జరిగాయి. తండ్రి చనిపోతే ఆమె వ్యవహరించిన తీరు సరిగా లేదు. తండ్రి మీద ప్రేమ ఉంటే నిన్నటి నుంచి ఎందుకు రాలేదు? నేను బెదిరించే వాడిని అయితే  నా పేరు ఎందుకు బయటకు రాలేదు? మా అన్న చనిపోయాక ..అమృతకు ఎందుకు ప్రేమ పుట్టుకు వచ్చింది? (అమృతకు నిరాశ.. దక్కని చివరి చూపు!)

నాన్న అని పిలవడానికి కూడా అమృతకు మాట రావడం లేదు. మీడియాలో కనిపించడం కోసం డ్రామాలు. వాళ్ల అమ్మ దగ్గరకు వస్తే నాకేం అభ్యంతరం లేదు. అన్యాయంగా నన్ను జైలుకు పంపించారు. మళ్లీ ఇప్పుడు నా పై ఆరోపణలు చేస్తోంది. దయచేసి మీడియా కూడా అవాస్తవాలు రాయొద్దు. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఒకవేళ మా అన్న ఎవరికైనా అప్పు ఉంటే వాటిని తీర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని తెలిపారు. (మిస్టరీగా మారుతీరావు మరణం!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top