
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 66 వేల మొక్కలను కానుకగా ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున ప్రతీ ఒక్కరు ఒక మొక్క నాటాలని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
ఎల్‌పీజీ డీలర్లు 17న ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీతో పాటు ఒక మొక్కను కూడా అందించాలని కోరారు. పౌరసరఫరాల శాఖకు చెందిన 170 గోదాముల్లో ఉద్యోగులందరు మొక్కలు నాటాలనీ, రాష్ట్రంలోని ప్రతీ రైస్ మిల్లు, పెట్రోల్ బంకు, ఎల్‌పీజీ గోదాముల్లో కనీసం ఐదు మొక్క లకు తక్కువ కాకుండా నాటేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.