మావోయిస్టులొస్తున్నారు.. జాగ్రత్త..!

Maoists He Is Coming Be Carfile Says On Police Department Khammam - Sakshi

సాక్షి, ఇల్లెందు: ‘‘మావోయిస్టు యాక్షన్‌ టీం తిరుగుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని, ఇల్లెందు డీఎస్పీ జి.ప్రకాశరావు హెచ్చరించారు. ఆయన బుధవారం ఇల్లెందు పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ‘‘ఆరుగురు సభ్యులున్న మావోయిస్టు యాక్షన్‌ టీం తిరుగుతోంది. వారు బైక్‌ల మీద వస్తున్నారు. వారిని గుర్తించేందుకు ఫోటోలు విడుదల చేస్తున్నాం.

ఆ ఆరుగురిలో.. 

  •  కుర్సం మంగూ అలియాస్‌ పాపన్న (భద్రు):  ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా చరమాంగి గ్రామస్తుడు.
  •  లింగయ్య (లింగు) అలియాస్‌ రాకేష్‌:           ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కుంట తాలూకా, మడకంగూడ గ్రామస్తుడు.
  •  మడివి కాయ అలియాస్‌ రమేష్‌:               భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం మండలంలోని పిట్టతోగు గ్రామస్తుడు.
  •  కొవ్వాసి గంగ అలియాస్‌ మహేష్‌:              ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా నెమలిగూడ గ్రామస్తుడు.
  •  మంగతు:                                            ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందినవాడు. 
  •  పండు అలియాస్‌ మంగులు:                     ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా కోట్రం బైరంగఢ్‌ గ్రామస్తుడు.

జాడ చెబితే.. లక్షల రూపాయలు..! 
ఈ పోస్టర్‌లోని వీరిని గుర్తుపట్టి సమాచారమిస్తే ఐదులక్షల రూపాయల బహుమతి ఇస్తాం. సమచారం ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతాం. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చినా, ఎవరి మీదనైనా అనుమానం ఉన్నా వెంటనే సమీపం పోలీస్‌ స్టేషన్‌కు సమాచాం ఇవండి’’. సమావేశంలో ఇల్లెందు సీఐ డి.వేణుచందర్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top