లిక్విడ్స్‌తో వర్కవుట్స్‌

Liquid Protein For Gym Workout - Sakshi

నగరంలో నయా ట్రెండ్‌

శరీరం అలసిపోకుండా..వర్కవుట్ల మధ్య లిక్విడ్లు..

ఆధునిక జిమ్‌ విధానంపై యువత ఆసక్తి

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా వ్యాయామాలు చేసేవారు.. పరగడుపున ఎలాంటి ఆహారం తీసుకోకుండా పరుగులు పెట్టి, తరువాత కఠిన వ్యాయామాలతో దేహదారుఢ్యానికి సానబెడతారు. కానీ, దీని వల్ల త్వరగా లక్ష్యాన్ని చేరలేరంటున్నారు జిమ్‌ ఎక్స్‌పర్టులు. ఖాళీకడుపుతో జిమ్‌ చేయడం కంటే.. వర్కవుట్ల మధ్యలో లిక్విడ్లు తీసుకుంటూ జిమ్‌ చేసే నయా ట్రెండ్‌ను నగర యువత ఎంజాయ్‌ చేస్తున్నారు. కాసేపు వర్కవుట్‌.. కొంచెం ఎనర్జీ లిక్విడ్‌ తీసుకున్నాక తిరిగి వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు. ఇది వినేందుకే కాదు, చేసేందుకు కూడా కొత్తగా ఉండటంతో పలువురు యువత ఇలాంటి వర్కవుట్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రొటీన్లు దండిగా ఉండే ఈ లిక్విడ్ల వల్ల శరీరానికి ఎలాంటి అలసట రాకపోగా, మంచి శరీరాకృతి మీ సొంతమవుతుందంటున్నారు నిపుణులు.

ఈ లిక్విడ్లు ఎందుకు?
సాధారణంగా వ్యాయామం చేసేటపుడు శరీరం చాలా శక్తిని కోల్పోతుంది. ఫలితంగా బీపీ, జీవక్రియలు అనూహ్యంగా పెరుగుతా యి. పెరిగిన శరీర ఉష్ణోగ్రతను చల్లబరిచేందు కు శరీరంలోని నీటిని దేహం చెమట రూపం లో విడుదల చేస్తుంది. ఫలితంగా దేహంలోని ఎలక్ట్రోలైట్స్, సోడియం, మెగ్నీషియం, పొటాషియం చెమటతోపాటు బయటికి వచ్చేస్తాయి. ఇది ఎక్కువైతే డీ హైడ్రేషన్‌గురయ్యే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. అందుకే, అలాంటి ప్రమాదాలు జరక్కుండా శరీరంలో కోల్పోయిన ప్రొటీన్లు, శక్తి, నీటిని భర్తీ చేసేందుకు ఈ ఎనర్జీ డ్రింకులు ఉపయోగపడతాయ ని పలువురు బాడీ బిల్డర్లు చెబుతున్నారు.

ఎన్ని రకాలుగా ఉంటాయి..?
వర్కవుట్ల మధ్యలో ఎనర్జీ కోల్పోకుండా ఉండాలంటే.. బీసీఏఏ (బ్రాడ్‌ చెయిన్‌ అమైనో ఆసిడ్స్‌) తీసుకోవచ్చని సూచిస్తున్నారు. 20 నిమిషాలపాటు వర్కవుట్లు చేసిన తరువాత 4 నుంచి 6 ఔన్సుల ఎనర్జీ డ్రింకును కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు. లేదా కోకోనట్‌ వాటర్‌ లేదా గ్లూకోన్‌–డి, రెడ్‌బుల్‌ డ్రింకులను వర్కవుట్ల మధ్యలో తాగొచ్చని సూచిస్తున్నారు. కండరాల పునరుత్తేజం, బలహీనమైన కండరకణాలకు శక్తిని చేకూరుస్తాయి.

శరీరానికి ఎంతో మేలు చేస్తాయి
వ్యాయామం మధ్యలో తీసుకునే లిక్విడ్లను ఇంట్రా లిక్విడ్లు అంటారు. ఇవి తీసుకోవడం వల్ల శరీరం త్వరగా అలసిపోదు. పైగా కోల్పోయిన ప్రొటీన్లు ఈ డ్రింకులతో భర్తీ చేయవచ్చు. ఫలితంగా డీ హైడ్రేషన్‌ను నివారించవచ్చు. డీ హైడ్రేషన్‌ అంటే అంతా వేసవిలోనే జరుగుతుందనుకుంటారు. కానీ, అన్ని కాలాల్లోనూ శరీరం డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలున్నాయి. అందుకే, ఈ ఇంట్రా లిక్విడ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అమైనో ఆసిడ్స్, ప్రొటీన్లు శరీరానికి వేగంగా అందుతాయి. ఎక్కువ మోతాదులో కాకుండా 4 నుంచి 6 ఔన్సులు మాత్రమే ఉండాలి.  ఎక్కువ మొత్తంలో తీసుకుంటే వాంతులవుతాయి. నిపుణుల సమక్షంలో చేస్తే మరీ మంచిది. – జయసింహ, ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top