కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు | last elections with congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు

Apr 3 2014 12:09 AM | Updated on Sep 2 2017 5:29 AM

దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు అని ఈ విషయాన్ని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తూడి దేవెందర్‌రెడ్డిలు మర్చిపోవద్దని స్థా నిక ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.

 జూలకంటి రంగారెడ్డి
 
 మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు అని ఈ విషయాన్ని  ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తూడి దేవెందర్‌రెడ్డిలు మర్చిపోవద్దని  స్థా నిక ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీపీఎంకు చివరి ఎన్నికలు అని చెబుతున్న వారికి దేశ, రాష్ట్ర పరిస్థితులు అర్థం కావడం లేవని ఎద్దేవ చేశారు.

మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారని, నిత్యం ప్రజాసమస్యల పట్ల స్పందించి, వాటి పరిష్కారానికి పని చేసే వారిని మరిచి పోరన్నారు.జాతీయ ఉపాధి హామీ పథకం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మంజూరుకు తాను ఎంతో కృషి చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహకారం అందించిన వారిలో రాష్ట్రం లోనే రెండవ ఎమెల్యేగా తనకు గుర్తింపు లభించిందన్నారు. సమావేశంలో వేములపల్లి మండల కార్యదర్శి రావు ఎల్లారెడ్డి  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement