
ఆస్తి కోసం.. రక్త సంబంధం మరిచారు
రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతుకుంట మండలం నర్సక్కపేటలో దారుణం చోటుచేసుకుంది.
ఇల్లంతుకుంట: రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతుకుంట మండలం నర్సక్కపేటలో దారుణం చోటుచేసుకుంది. పొంకటి లింగయ్య(45), పొంకటి కనకయ్య అన్నదమ్ములు. కలిసి మెలిసి ఉండాల్సిన వారు భూమి విషయంలో గొడవకు దిగారు. ఆస్తి కోసం అన్నదమ్ములు రక్త సంబంధం మరిచిపోయారు.
గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో పరస్పరం కత్తులతో దాడికి దిగి పొడుచుకున్నారు. తీవ్రగాయలపాలైన వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.