హోంగార్డుపై అత్యాచారం.. దారుణ హత్య! | lady homeguard raped and murdered in medchal | Sakshi
Sakshi News home page

హోంగార్డుపై అత్యాచారం.. దారుణ హత్య!

Sep 5 2014 10:19 AM | Updated on Jul 28 2018 8:53 PM

హోంగార్డుపై అత్యాచారం.. దారుణ హత్య! - Sakshi

హోంగార్డుపై అత్యాచారం.. దారుణ హత్య!

ఓ మహిళా హోంగార్డుపై కొందరు దుండగులు అత్యాచారం చేసి, ఆమెను దారుణంగా హతమార్చారు.

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ప్రజలకు రక్షణ కల్పించే రక్షకభటులని కూడా చూడకుండా.. ఓ మహిళా హోంగార్డుపై అత్యాచారం చేసి, హతమార్చారు. ఈ దారుణ సంఘటన మేడ్చల్ మండలం బాసరగడిలో జరిగింది. ఆమెను అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి మరీ అత్యాచారం చేసి చంపేశారు.

పోలీసు ఐజీ కార్యాలయంలో హోం గార్డుగా పనిచేసే నవనీత అనే మహిళపై కొందమంది దుండగులు అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమె తలపై బండరాయితో మోది హతమార్చారు. తమ విషయం బయటపడితే మళ్లీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే వాళ్లు ఇలా దారుణంగా ఆమెను హతమార్చినట్లు తెలిసింది. అయితే.. హోం గార్డును ఎక్కడినుంచైనా అపహరించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారా.. లేదా నిందితులతో ఆమెకు ముందే పరిచయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement
 
Advertisement
Advertisement