
నేడు అమెరికా వెళ్లనున్న కేటీఆర్
పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం అమెరికా వెళ్లనున్నారు.
హైదరాబాద్: పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం అమెరికా వెళ్లనున్నారు. ఈ నెల 5 నుంచి 16 వరకు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో గూగుల్ క్యాంపస్ ఏర్పాటుకు ఆ సంస్థ అధికారులతో సమావేశం అవుతానన్నారు. కాలిఫోర్నియాలోని శాంతాక్లారా కన్వెన్షన్ సెంటర్‌లో 15, 16 తేదీల్లో టైకాన్-2015 సదస్సులో పాల్గొననున్నారు.