స్వగ్రామంలో కిషన్‌రెడ్డి పర్యటన | Kishan Reddy Visits His Hometown Kandukur | Sakshi
Sakshi News home page

స్వగ్రామంలో కిషన్‌రెడ్డి పర్యటన

Sep 14 2019 12:55 PM | Updated on Sep 14 2019 12:55 PM

Kishan Reddy Visits His Hometown Kandukur - Sakshi

కిషన్‌రెడ్డిని సన్మానిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు తదితరులు

సాక్షి, కందుకూరు: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి తన స్వగ్రామమైన కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో శుక్రవారం పర్యటించారు. గ్రామంలో తాను నిర్మించిన రామాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. అనంతరం తన తల్లిదండ్రుల సమాధుల వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఆయన రాకతో గ్రామస్తులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

అనంతరం పార్టీ నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్, రాష్ట్ర నాయకుడు ఎల్మటి దేవేందర్‌రెడ్డి, నాయకులు మాదారం రమేష్‌గౌడ్, కొంతం జంగారెడ్డి, అశోక్‌గౌడ్, విష్ణు, ఎల్లారెడ్డి, నిమ్మ అంజిరెడ్డి, రాజేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, బాల్‌రాజ్, శ్రీనివాస్‌గౌడ్, మల్లేష్, నిరంజన్, వైస్‌ ఎంపీపీ శమంత ప్రభాకర్‌రెడ్డి తదితరులు కిషన్‌రెడ్డిని కలిశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement