స్కూల్ ఆవరణలో చెట్టుపడి చిన్నారి మృతి | Kid dies as tree falls on her | Sakshi
Sakshi News home page

స్కూల్ ఆవరణలో చెట్టుపడి చిన్నారి మృతి

Mar 13 2015 7:20 PM | Updated on Sep 28 2018 3:39 PM

స్కూల్ ఆవరణలో చెట్టుపడి చిన్నారి మృతి - Sakshi

స్కూల్ ఆవరణలో చెట్టుపడి చిన్నారి మృతి

రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్ విషాటు చేదం చోసుకుంది.

రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం):మండలంలోని కొంగరకొలన్ గ్రామంలో చెట్టుకూలి గాయత్రి (5) అనే విద్యార్థిని మృతిచెందింది. గ్రామంలోని సరస్వతీ విద్యానికేతన్ స్కూల్ పక్కనే ఒక మర్రి చెట్టు ఉంది. నారాయణ అనే వ్యక్తి ఆ చెట్టును కూలీలతో చెట్టు నరికివేస్తుండగా ప్రమాదవశాత్తూ స్కూల్లో ఉన్న విద్యార్థినిపై పడింది. పాప మృతి చెందడంతో తల్లిదండ్రులు గణేశ్, చైతన్యలు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

వారికి ఇద్దరు కుమార్తెలు. చనిపోయిన పెద్ద కుమార్తె గాయత్రి ఎల్‌కేజీ చదువుతోంది. ఈ ప్రమాదంలో మరో విద్యార్థినికి స్వల్ప గాయాలయ్యాయి.స్కూల్ ఆవరణలో ఉన్న చెట్టును కూల్చే క్రమంలో ముందస్తు చర్యలు తీసుకోపోవడం వల్లే చిన్నారి మృతి చెందిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement