ప్రమాదవశాత్తూ బావిలో పడి ఓ విద్యార్థి మృదిచెందాడు.
ఇంద్రవెల్లి (ఆదిలాబాద్): ప్రమాదవశాత్తూ బావిలో పడి ఓ విద్యార్థి మృదిచెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలు.. మండలంలోని గోపల్‌సింగ్ తండాకు చెందిన అంతర్వేది జయసింగ్ (12) ఆరోతరగతి చదువుతున్నాడు. తన స్నేహితుడితో కలిసి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన జయసింగ్ నీటిని తాగేందుకు బావిలోకి దిగాడు.
ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తూ కాలుజారి బావిలో పడ్డాడు. ఈత రాకపోవడంతో బావిలో పడిన బాలుడు మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.