
ఆందోళన చేస్తున్న విద్యార్థులు
దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ సమీపంలో ఉన్న కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులు శుక్రవారం ఆందోళనకు దిగారు. బొట్టు పెట్టుకోవద్దని, పూజలు చేయవద్దని చెప్పడంతో పాటు ఇతర మతాల ప్రార్థన చేయాలంటూ ప్రిన్సిపాల్ నిస్సీనిహారిక ఆంక్షలు విధిస్తుండగా.. సిబ్బంది చెప్పలేని మాటలతో హింసిస్తున్నారని వారు తెలిపారు.
ఈ మేరకు తహసీల్దార్ చెన్నకిష్టయ్య, డీఈఓ సోమిరెడ్డి పాఠశాలకు వచ్చి విచారించారు. విద్యార్థినుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని తేలడంతో ప్రిన్సిపాల్ నిస్సీనీహారిక, క్రాఫ్ట్ టీచర్ రుక్మిణి, ఇంగ్లిష్ టీచర్ సారా, వంట మనిషి జయమ్మ, వాచ్‌మన్ యాదమ్మను డీఈవో సస్పెండ్‌చేశారు.