సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగం: ఘంటా చక్రపాణి | Job based on ability : Ghanta Chakrapani | Sakshi
Sakshi News home page

సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగం: ఘంటా చక్రపాణి

Dec 18 2014 3:33 PM | Updated on Sep 2 2017 6:23 PM

ఘంటా చక్రపాణి

ఘంటా చక్రపాణి

రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేకుండా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్పిఎస్సి) పని చేస్తుందని చైర్మన్ గంటా చక్రపాణి చెప్పారు.

హైదరాబాద్: రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేకుండా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్పిఎస్సి) పని చేస్తుందని  చైర్మన్  ఘంటా చక్రపాణి చెప్పారు. నిరుద్యోగుల సామర్ధ్యన్ని బట్టి ఉద్యోగాలు వస్తాయన్నారు. రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గనని ఆయన చెప్పారు. అవినీతి రహిత ఆదర్శ వ్యవస్థగా టిఎస్పిఎస్సి పని చేస్తుందని తెలిపారు.

 టిఎస్పిఎస్సి సభ్యులు పారదర్శకంగా పని చేసి బంగారు తెలంగాణ నిర్మించాలని ఆయన పిలుపు ఇచ్చారు. తెలంగాణ నిరుద్యోగులకు రెండుమూడు నెలల్లో ఉద్యోగనియామకాల నోటిఫికేషన్ వెలువడుతుందని చక్రపాణి చెప్పారు.

టిఎస్పిఎస్సి సభ్యుడు విఠల్ మాట్లాడుతూ ఇక కమిషన్ కార్యాలయం ముందు నిరుద్యోగుల ధర్నాలు ఉండవన్నారు. కమిషన్ సభ్యులుగా నిస్పక్షపాతంగా వ్యవహరిస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాలకంటే అదర్శంగా టిఎస్పిఎస్సిని తయారు చేస్తామన్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement