దేశం అబ్బురపడేలా అభివృద్ధి: కేటీఆర్‌ | IT Minister KTR Visits Khammam District | Sakshi
Sakshi News home page

దేశం అబ్బురపడేలా అభివృద్ధి: కేటీఆర్‌

Apr 9 2018 2:29 PM | Updated on Aug 15 2018 9:06 PM

 IT Minister KTR Visits Khammam District - Sakshi

దేశం అబ్బురపడేలా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

సాక్షి, ఖమ్మం:  దేశం అబ్బురపడేలా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో సోమవారం కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని చెప్పారు. పేదవారి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే కేసీఆర్ ధ్యేయమని వెల్లడించారు. తెలంగాణలో 42 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని..  పింఛన్ల కోసం రూ. 4 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌ మహిళల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే.. ఇంటింటికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టామని అన్నారు.

మరో వైపు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన సందర్భంగా పలువురు నేతలనను ముందస్తు అరెస్టులు చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఖమ్మం టూటౌన్‌ కారదర్శి వై. విక్రమ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అక్రమ అరెస్టును సీపీఎం నేతలు ఖండిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement