ఐపీఎస్ అధికారుల బదిలీల్లో మార్పులు | IPS officers transfers changed in telangana | Sakshi
Sakshi News home page

ఐపీఎస్ అధికారుల బదిలీల్లో మార్పులు

Nov 14 2014 2:13 AM | Updated on Aug 17 2018 2:51 PM

ఇటీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీలలో కొన్ని మార్పులు చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీలలో కొన్ని మార్పులు చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరాబాద్ నగర సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డిని ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఆయనను తిరిగి సెంట్రల్ జోన్ డీసీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న తరుణ్ జోషీని సెంట్రల్ జోన్ డీసీపీగా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, ఆయనను ఆదిలాబాద్ ఎస్‌పీగా నియమించారు. ప్రస్తుతం తరుణ్ జోషీ సైబరాబాద్ కమిషనరేట్  పరిధిలోని ఎల్‌బీ నగర్ డీసీపీగా తాత్కాలికంగా కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement