వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి | Hundred percent of the property tax to be charged | Sakshi
Sakshi News home page

వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి

Apr 8 2016 2:49 AM | Updated on Sep 3 2017 9:25 PM

వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి

వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి

ఆస్తిపన్ను వసూలుకు ప్రభుత్వం గడువు పెంచిన నేపథ్యంలో వందశాతం వసూలు చేయూలని కలెక్టర్ నీతూప్రసాద్ ...

కలెక్టర్ నీతూప్రసాద్

ముకరంపుర : ఆస్తిపన్ను వసూలుకు ప్రభుత్వం గడువు పెంచిన నేపథ్యంలో వందశాతం వసూలు చేయూలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో మున్సిపల్ కమిషనర్లతో ఆస్తి పన్ను వసూలు, ఐఎస్‌ఎల్ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. గ్రామాల్లో ఏప్రిల్ 15 వరకు, పట్టణాలలో ఏప్రిల్ 10 వరకు పన్ను వసూళ్లకు గడువు ఉందన్నారు. వార్డులవారీగా టీంలు ఏర్పాటుచేసి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పన్నుల వసూళ్లకు సంబంధిత కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సహకారం తీసుకోవాలన్నారు. పన్నులు బకాయిలు ఎక్కువ ఉన్న రైస్‌మిల్లర్లు, ఫంక్షన్‌హాలు, పౌల్ట్రీఫాంలు తదితర వాటిపై ఒత్తిడి తెచ్చి వంద శాతం పన్నులు వసూలు చే యాలన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో చాలాచోట్ల వంద శాతం వసూలు చేశారని, అంతకంటే తక్కువ పట్టణ ప్రాంతాలలో ఉండకూడదని సూచించారు. పట్టణ ప్రాంతాలలో వంద శాతం, ఐఎస్‌ఎల్‌ను నిర్మించాలని ఆదేశించారు. మెప్మా పీడీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement