తెలంగాణ ఓటర్ల జాబితాపై సుప్రీం కీలక ఆదేశాలు

Heated Arguements In Supreme Court On Telangana Voters List - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ఓటర్ల జాబితా అంశంపై హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. పిటిషన్‌లోని మెరిట్ ఆధారంగా ఓటర్ల తుది జాబితా గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. రేపే విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. అంతకుముందు ఈ అంశంపై అందరి వాదనలను సర్వోన్నత న్యాయస్థానం ఆలకించింది.

తెలంగాణలో ఓటర్ల జాబితా అంశంపై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. పిటిషనర్‌ తరపున అభిషేక్‌ సింఘ్వి వాదనలు వినిపిస్తూ ఓటర్ల జాబితా షెడ్యూల్‌ కుదించారని, తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారని కోర్టుకు నివేదించారు. ఓటర్ల జాబితాలో 68 లక్షల ఓటర్ల విషయంలో అవకతవకలు జరిగాయని, 30 లక్షల బోగస్‌ ఓట్లున్నాయని చెప్పారు. ఓటర్ల జాబితా నుంచి 18 లక్షల ఓట్లను తొలగించారని సర్వోన్నత న్యాయస్ధానం దృష్టికి తీసుకువెళ్లారు. కటాఫ్‌ తేదీని ఈ ఏడాది జనవరి 1గా నిర్ణయించడం వల్ల 20 లక్షల మంది తమ ఓటు హక్కు కోల్పోతున్నారని, 2000 సంవత్సరంలో పుట్టిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 2024 వరకూ వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

మరోవైపు విచారణలో జోక్యం చేసుకుంటూ అసెంబ్లీ రద్దయిన పక్షంలో వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని జస్టిస్‌ ఏకే సిక్రీ కోరారు. గతంలో తోసిపుచ్చిన పిటిషన్లలో ఇవే అభ్యర్థనలు ఉంటే కేసులో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. ఈసీ అడ్వకేట్‌ తన వాదనలు వినిపిస్తూ ఓటరు జాబితా అనేది నిరంతర ప్రక్రియని, హైకోర్టులో ఇవే అభ్యర్థనలపై వేసిన పిటిషన్లను డిస్మిస్‌ చేశారని గుర్తు చేశారు. కాగా హైకోర్టు డిస్మిస్‌ చేసిన ఉత్తర్వుల కాపీని తమకు ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది. సిద్ధిపేటకు చెందిన సుశాంత్‌ రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. వాదోపవాదనలు విన్న సుప్రీం కోర్టు మళ్లీ ఈ అంశాన్ని హైకోర్టుకు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top