అతి చిన్న పేస్‌మేకర్‌తో గుండె ఆపరేషన్‌ | heart operation with face makeover | Sakshi
Sakshi News home page

అతి చిన్న పేస్‌మేకర్‌తో గుండె ఆపరేషన్‌

Nov 1 2017 7:33 AM | Updated on Nov 1 2017 7:33 AM

heart operation with face makeover

జూబ్లీహిల్స్‌: ప్రపంచంలోనే అతిచిన్న పేస్‌మేకర్‌తో 81 సంవత్సరాల వృద్ధుడికి గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా చేసినట్లు, ప్రస్తుతం వృద్ధుడు ఉల్లాసంగా తిరుగుతున్నాడని కాంటినెంటల్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ భరత్‌ పురోహిత్‌ పేర్కొన్నారు. మంగళవారం తాజ్‌డెక్కన్‌ హోటల్‌లో ఏర్పాటు చే6సిన మీడియా సమాÔవేశంలో ఆయన మాట్లాడుతూ...కేవలం ఏడాది క్రితమే అమెరికన్‌ ఎఫ్‌డీఏ అనుమతించిన ఈ ‘లీడ్‌ లెస్‌ పేస్‌మేకర్‌’ సంప్రదాయ పేస్‌మేకర్లతో పోలిస్లే కేవలం పదవ వంతు సైజు మాత్రమే ఉంటుందని తెలిపారు.

స్లో హార్ట్‌ బీట్‌తో బాధపడుతున్న వృద్ధుడు తమను సంప్రదించడంతో ఆయన కుటుంబ సభ్యులతో చర్చించి శస్త్ర చికిత్స చేశామని, సాధారణ పేస్‌ మేకర్లతో పోల్చుకుంటే కనీసం 50 శాతం తక్కువ సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు తగ్గిస్తుందన్నారు.చికిత్స ఖర్చు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుందన్నారు. ఈ పేస్‌మేకర్‌ జీవితం కాలం దాదాపు 12 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement