26 నుంచి రాష్ట్ర వాసుల హజ్‌ యాత్ర 

Hajj yatra for state residents from 26th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి హజ్‌ యాత్ర– 2019కు వెళ్లే యాత్రికుల విమాన షెడ్యూల్‌ను రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ మహ్మద్‌ మసీవుల్లాన్‌ సోమవారం విడుదల చేశారు. నాంపల్లి హజ్‌ హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బృందం ఈ నెల 18న నగరం నుంచి హజ్‌ యాత్రకు బయలుదేరిందని తెలిపారు. తెలంగాణ హజ్‌ యాత్రికుల ప్రయాణ తేదీలు ఖరారయ్యాయని వెల్లడించారు.

రాష్ట్ర యాత్రికులు మొత్తం 15 విమానాల ద్వారా ఈ నెల 26 నుంచి 30 వరకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రయాణం అవుతారని చెప్పారు. రాష్ట్ర హజ్‌ యాత్రికుల మొదటి బృందం ఈ నెల 26న రాత్రి 8:25కి జిద్దాకు ప్రయాణం అవుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,685 మంది యాత్రికులు ఈ ఏడాది హజ్‌ కమిటీ ద్వారా యాత్రకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 30 నుంచి ఆగస్టు 4 వరకు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర యాత్రికులు హజ్‌ యాత్రకు వెళ్తున్నట్లు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top