మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గీతం యూనివర్సిటీ విద్యార్థి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
సంగారెడ్డి: మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గీతం యూనివర్సిటీ విద్యార్థి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. యూనివర్సిటీలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సుహాస్ మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. తోటి విద్యార్థితో సెల్‌ఫోన్ విషయంలో జరిగిన గొడవ వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.