ఖరీఫ్‌ ప్రణాళిక సిద్ధం చేయాలి: గట్టు  

Gattu Srikanth Reddy Demands For Kharif Planning - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖరీఫ్‌(పునాస) సీజన్‌కు సంబంధించిన ప్రణాళికను వ్యవసాయ శాఖ తక్షణమే సిద్ధం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఖరీఫ్‌ ప్రణాళిక సిద్ధం చేయడంలో తాత్సార్యం తగదని విమర్శించారు. శనివారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడు దల చేశారు. రైతులు అమ్మిన వరి ధాన్యానికి ప్రభుత్వం రూ.1,500 కోట్లు చెల్లించాలని కోరా రు.

విత్తనాలు, ఎరువులు కొనటానికి డబ్బుల్లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయాలని కోరారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసే కంపెనీలపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసి వాటి లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి రైతులకు ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని కోరారు.  ఇప్పటికైనా రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top