‘హామీలను నెరవేర్చిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలి’ | Gattu Srikanth Reddy Demands For Implement Promises | Sakshi
Sakshi News home page

‘హామీలను నెరవేర్చిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలి’

Sep 3 2018 4:05 PM | Updated on Sep 3 2018 5:25 PM

Gattu Srikanth Reddy Demands For Implement Promises - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలన్ని నెరవేర్చిన తరువాతనే కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్లాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మీడియాతో​ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీల మేరకు వెంటనే లక్షన్నర ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని కోరారు. దళితులకు మూడు ఎకారాల భూమి పంపిణీ చేయాలని అన్నారు. రాష్ట్రంలో 2.70 లక్షల డబుల్‌ బెడ్రుం ఇళ్లు ఇస్తానన్నాని.. కేవలం పదివేల ఇళ్లు మాత్రమే నిర్మించారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్‌ ఏవిధంగా ప్రజలను ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement