యువతిపై సామూహిక అత్యాచారం | gang rape in rangareddy district | Sakshi
Sakshi News home page

యువతిపై సామూహిక అత్యాచారం

Mar 16 2015 9:23 AM | Updated on Aug 21 2018 8:23 PM

యువతిపై సామూహిక అత్యాచారం - Sakshi

యువతిపై సామూహిక అత్యాచారం

రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. రాత్రి బస్సుకోసం వేచి చూస్తున్న ఓ

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి మన్నెగూడలో బస్సుకోసం వేచి చూస్తున్న ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.  సీలాపూర్కు చెందిన దానయ్య తన ఆటోలో ఆ యువతిని సురక్షితంగా ఇంటికి చేర్చుతానని నమ్మబలికి, అనంతరం తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

అయితే యువతి కేకలు విన్న గ్రామస్తులు ...పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు వెంటనే స్పందించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ మాల శ్రీనివాస్, ఎర్రవెల్లి భీమయ్య, దానయ్య, ఎర్రవెల్లి మల్లయ్యలను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం ఉదయం చేవెళ్లలోని కోర్టులో హాజరుపరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement