‘కల్యాణలక్ష్మి’కి రూ.144 కోట్లు విడుదల  | Funds Released For Kalyana Lakshmi | Sakshi
Sakshi News home page

Feb 5 2019 2:44 AM | Updated on Feb 5 2019 2:46 AM

Funds Released For Kalyana Laxmi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 2018–19 వార్షిక సంవత్సరంలో 36,254 మం ది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీటిలో 22,862 దరఖాస్తుల పరిశీలన పూర్తి కావడంతో వాటికి నిధులు విడుదల చేశారు. ఇందుకు రూ.144.5 కోట్లను రెవెన్యూ డివిజనల్‌ అధికారులకు విడు దల చేసినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్‌ చెప్పారు. వారంలోపు లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు పూర్తిస్థాయిలో పరిష్కారం కానున్నాయని, ఇందుకు సరిపడా నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. మిగతా దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని, బడ్జెట్‌ సరిపడా అందు బాటులో ఉండటంతో పరిశీలన పూర్తయ్యాక నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది వచ్చిన దరఖాస్తుల్లో 604 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement