తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ల సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారితో సోమవారం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు భేటీ అయ్యారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ల సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారితో సోమవారం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో శనివారం గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనపై చర్చిస్తున్నారు. సభలో బెంచీలు ఎక్కినవారిపై చర్యలు తీసుకునే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.