దారుణం: ఉసురు తీసిన ఊర కుక్కలు

Five Year Old Child Deceased In Dogs Brutally Attacks In Mulugu District - Sakshi

సాక్షి, ములుగు: జిల్లాలోని ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామ శివారులో ఘోరం జరిగింది. ఊర కుక్కలు బీభత్సం సృష్టిoచాయి. ఓ చిన్నారిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. కర్ణాటకలోకి గుల్బార్గాకు చెందిన వలస కార్మిక కుటుంబ రామప్ప-పాకాల పైపులైన్‌ పనులు చేస్తోంది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు కంపెనీలో పనికి వెళ్లడంతో వారికోసం ఆడుకుంటూ గుట్ట పైకి వెళ్లిన ఐదేళ్ల బాలుడి చిరంజీవిపై కుక్కలు దాడికి దిగాయి. తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కార్మిక కుటుంబం 2 నెలలుగా పైపులైన్‌ పనులో చేస్టున్నట్టు తెలిసింది. ఇక్కడే తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top