అప్పుల బాధతో రైతు బలవన్మరణం | Farmer suicide in khammam district over finance problems | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

Jan 30 2016 3:16 PM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

ఖమ్మం: అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. గుండాల మండలం మిట్టపల్లిగుంపు గ్రామానికి చెందిన కోటయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో సాగు కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో పాటు పంట దిగుబడి రాకపోవడంతో.. మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం మృతిచెందినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement