ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య | Engineering student commits suicide | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

Mar 7 2017 11:48 PM | Updated on Mar 28 2018 11:26 AM

ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై లింగస్వామి కథనం ప్రకారం...

ఇబ్రహీంపట్నం: ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై లింగస్వామి కథనం ప్రకారం... మంచాల మండలం బండలేమూర్‌ గ్రామ సర్పంచ్‌ పోచమోని కృష్ణ  కుటుంబంతో కలిసి ఇబ్రహీంపట్నంలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అతని కూతురు శ్రీవాణి(22) బొంగులూర్‌ గేట్‌ వద్ద గల జేఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌(ఈసీఈ) చివరి సంవత్సరం చదువుతోంది.

ఒంట్లో బాగలేకపోవడంతో గత మూడునాలుగురోజులుగా ఇంట్లోనే ఉంటోంది. ఏమైందో తెలీదుకానీ మంగళవారం శ్రీవాణి ఇంట్లోనే చున్నీతో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒక్కగానొక్క కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement
 
Advertisement
Advertisement