'రెడ్యానాయక్ చేరిక కుటిల రాజకీయం కాదు' | ds redya naik, maluju kavita joins trs | Sakshi
Sakshi News home page

'రెడ్యానాయక్ చేరిక కుటిల రాజకీయం కాదు'

Nov 4 2014 5:47 PM | Updated on Aug 14 2018 10:51 AM

'రెడ్యానాయక్ చేరిక కుటిల రాజకీయం కాదు' - Sakshi

'రెడ్యానాయక్ చేరిక కుటిల రాజకీయం కాదు'

దళితులు, గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు.

హైదరాబాద్: దళితులు, గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. గిరిజన తండాలను పంచాయతీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఆయన కూతురు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత మంగళవారం సాయంత్రం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ చేరారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రెడ్యానాయక్ చేరికను కుటిల రాజకీయ చేరికలా చూడడం లేదని వ్యాఖ్యానించారు. గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అండదండలు అందించాలన్న ఉద్దేశంతో ఆయన తమ పార్టీలో చేరారని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం చరిత్రలో కనీవినీ ఎరుగని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీలోని గిరిజన నాయకులు ఐక్యంగా పనిచేయాలని కేసీఆర్ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement