మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి | Develop of Kapu Corporation | Sakshi
Sakshi News home page

మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి

Oct 2 2018 2:47 AM | Updated on Oct 2 2018 2:47 AM

Develop of Kapu Corporation - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: మున్నూరుకాపు కార్పొరేషన్‌ ఏర్పాటు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని నిజామాబాద్‌ ఎంపీ కవిత ప్రకటించారు. సోమవారం నిజామాబాద్‌లో నగర మున్నూరుకాపు సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు.

సంఘం నేత కొండ దేవన్న కోరుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని, అవసరమైతే తన వెంట తీసుకువెళ్లి కార్పొరేషన్‌ సాధనకు ప్రయత్నిస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరిస్తారో అదే వారి నిజమైన వైఖరి అని అన్నారు. కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement