‘కచ్చలూరు’ ఎఫెక్ట్‌ : గిరాకీ లేక నిలిచిన బోటు ప్రయాణం

Department of Tourism Has Canceled a Boat Trip From Sagar to Srisailam - Sakshi

సాక్షి, నల్గొండ : నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం వరకు వెళ్లాల్సిన బోటు ప్రయాణాన్ని అధికారులు శనివారం నిలిపివేశారు. గిరాకీ లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల గోదావరిలో కచ్చలూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బోటు సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాగర్‌ టు శ్రీశైలం బోటు ప్రయాణానికి కేంద్ర పర్యాటక శాఖ అనుమతులిచ్చినా ప్రయాణీకులు ఆసక్తి చూపడం లేదు. లాంచీ ప్రయాణం అంటేనే ప్రయాణీకులు హడలిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో టిక్కెట్లు అమ్ముడుపోక టూర్‌ను రద్దు చేస్తున్నట్లు పర్యాటక శాఖ ప్రకటించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top