రుణాల పేరుతో కెనరా బ్యాంక్‌ను మోసం చేసి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వినాయక రవిరెడ్డిలను సీబీఐ అధికారులు మంగళవారం రెండోరోజు కస్టడీకి తీసుకున్నారు.
హైదరాబాద్: రుణాల పేరుతో కెనరా బ్యాంక్‌ను మోసం చేసి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వినాయక రవిరెడ్డిలను సీబీఐ అధికారులు మంగళవారం రెండోరోజు కస్టడీకి తీసుకున్నారు.
చంచల్‌గూడ జైలులో ఉదయం 9.30 గంటలకు కస్టడీలోకి తీసుకుని కోఠిలోని సీబీసీ కార్యాలయానికి తరలించారు. విచారణ సమయంలో రవిరెడ్డికి ఛాతీ నొప్పి రావడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వెంకట్రామిరెడ్డిని తిరిగి జైలుకు తరలించారు.