క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు | cricket betting gang hasbeen arrested | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

Sep 2 2015 6:57 PM | Updated on Aug 20 2018 4:27 PM

నగరంలోని లంగర్ హౌజ్ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: నగరంలోని లంగర్ హౌజ్ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ ఐలయ్య తెలిపిన వివరాల ప్రకారం...లంగర్‌హౌజ్ ప్రశాంత్‌నగర్‌కు చెందిన టి.సత్యప్రకాష్ రియల్ ఎస్టేట్ బ్రోకర్. మంగళవారం సాయంత్రం భారత్, శ్రీలంక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తన ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు.

దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై జలందర్‌రెడ్డి తన సిబ్బందితో దాడి చేసి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ జరిపిన అనంతరం అర్థరాత్రి దాటాక లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సత్యప్రకాష్‌తో పాటు డబ్బులు వసూలు చేసే నల్లకుంటకు చెందిన అమిన్ మధాని(29), ఆబిడ్స్‌కు చెందిన మిరాన్ బర్దే(24), సాహిల్ నురాని(18)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement