కేసీఆర్.. తల ఎన్నిసార్లు నరుక్కుంటావు? | congress leader rajanarsimha takes on cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్.. తల ఎన్నిసార్లు నరుక్కుంటావు?

Dec 1 2014 5:27 PM | Updated on Sep 27 2018 8:33 PM

కేసీఆర్.. తల ఎన్నిసార్లు నరుక్కుంటావు? - Sakshi

కేసీఆర్.. తల ఎన్నిసార్లు నరుక్కుంటావు?

కేసీఆర్.. నువ్వు ఎన్నిసార్లు తల నరుక్కుంటావు అని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలోను, అంతకుముందు ఉద్యమం చేస్తున్నప్పుడు తానిచ్చిన లెక్కలేనన్ని హామీలలో ఒక్కదాన్ని కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిలబెట్టుకోలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మండిపడ్డారు. తెలంగాణకు దళితుడినే తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని, లేకుంటే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్.. నువ్వు ఎన్నిసార్లు తల నరుక్కుంటావు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. టీఎన్జీవోలకు సంబంధించి అసలు ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా లేవా అని ఆయన నిలదీశారు.

ఇక తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలం పుంజుకుంటే కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయనేత కుంతియా అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement