‘కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు’ | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు’

Published Sat, Dec 1 2018 3:36 PM

Congress Has Developed All Categories People - Sakshi

ఇచ్చోడ(బోథ్‌): కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని ప్రజాఫ్రంట్‌ ఉమ్మడి అభ్యర్థి సోయం బాపూరావు అన్నారు. శుక్రవారం మండలంలోని జామిడి, గెర్జం, చించోలి, నర్సపూర్, దర్మంపూరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఇస్లాంపూర మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాలుగున్నర ఏళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఎన్నికలలో ఎదుర్కొనే శక్తి లేకనే కొందరు నాయకులు స్వార్థం కోసం తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కానీ సోయం బాపూరావు కానీ గిరిజనేతరులకు వ్యతిరేకం కాదని తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీకి అన్ని వర్గాల ప్రజల అండ ఉందన్నారు. అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తుందని తెలిపారు. ఉచితంగా ప్రతీ కుటుంబానికి ఆరు గ్యాస్‌ సిలిండర్లు, ప్రతీ ఇంట్లో ఇద్దరికి రూ.2 వేల పింఛన్లు అందజేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నరేష్‌జాదవ్, కాంగ్రెస్‌ నాయకులు మల్లెపూల నర్సయ్య, కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు బుర్గుల మల్లెష్, నాయకులు బత్తుల అశోక్, సాగర్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, రవి, శంశొద్దీన్, తెలంగాణ పట్టభద్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లెం ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు. 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement