నీరా ఉత్పత్తుల తయారీ అధ్యయనానికి కమిటీ

Committee On Manufacturing Of Neera Products Says Srinivas Goud - Sakshi

అబ్కారీ, క్రీడా, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: నీరా, అనుబంధ ఉత్పత్తుల తయారీపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నీరా ఉత్పత్తుల తయారీ అంశంపై ఆయన ఆదివారం హైదరాబాద్‌లో అబ్కారీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గీత కార్మికుల సహకార ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ అలోక్‌కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీలో అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు, గీత వృత్తిదారు ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని మంత్రి వెల్లడించారు. రాజమండ్రి సమీపంలోని పందిరిమామిడిలో ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో టాడి అండ్‌ అలైడ్‌ ప్రొడక్టŠస్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో నీరా, అనుబంధ ఉత్పత్తుల తయారీని అధ్యయనం చేయాలని ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top