ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR Conduct Review Meeting On TSRTC Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. శనివారం ఆయన ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కొత్త నియామకాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. ఇ​క ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది. బస్‌ భవన్‌ వద్ద కార్మికులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. 

చదవండిఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని చెప్పలేదు: పువ్వాడ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top