కనీస వేతనాలు అమలు చేయాలి | CITU Union Leaders Protest In Warangal | Sakshi
Sakshi News home page

కనీస వేతనాలు అమలు చేయాలి

Jan 10 2019 11:46 AM | Updated on Mar 6 2019 8:09 AM

CITU  Union Leaders Protest In Warangal - Sakshi

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు

వరంగల్‌ రూరల్‌ : జిల్లాలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్, ప్రావిడెంట్‌ ఫండ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, టెక్స్‌టైల్‌ పార్కు పనులను పూర్తి చేసి ఉపాధి కల్పించాలని, బుధవారం వివిధ కార్మిక సంఘాల నాయకులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వ్యవసాయ ఆధారిత జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ఐటీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పలు డిమాండ్లు చేశారు.

నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి అదుపులో పెట్టాలని కనీస వేతనం నెలకు రూ.18,000 నిర్ణయించాలని కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నక్క చిరంజీవి, సీఐటీయూ జిల్లా కోశాధికారి అనంత గిరి రవి, సీఐటీయూ జిల్లా నాయకులు బొల్ల కొమురయ్య, జీపీ సంఘం అధ్యక్షుడు  వెంకటయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement