వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అనర్హత కేసు మరోసారి వాయిదా పడింది.
సాక్షి, న్యూఢిల్లీ: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అనర్హత కేసు మరోసారి వాయిదా పడింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ ఎన్నికల్లో ఆయన సమీప ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం మరోసారి విచారణకు వచ్చింది.
జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ సి.నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు రాగా.. ఈ కేసును తాను విచారించలేనని (నాట్ బిఫోర్ మీ) జస్టిస్ సి.నాగప్పన్ పేర్కొనడంతో ఈ కేసు మరో ధర్మాసనం ముందుకు వెళ్లనుంది.