నేపాల్ భూకంప బాధితులకు చంచల్‌గూడ కారాగారంలోని ఖైదీలు తమ వంతు సాయం అందించారు.
హైదరాబాద్: నేపాల్ భూకంప బాధితులకు చంచల్‌గూడ కారాగారంలోని ఖైదీలు తమ వంతు సాయం అందించారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ బి. సైదయ్య ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఆదివారం ఖైదీలకు ఆహారంలో మాంసం అందజేస్తారు.
కాగా, ఆదివారం చంచల్‌గూడ జైల్లోని 821 మంది ఖైదీలు ఒక రోజు మాంసాహారం మానేసి అందుకయ్యే ఖర్చు రూ. 47,200ను విరాళంగా అందివ్వాలని తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ అధికారులను కోరారు. వారి వినతి మేరకు ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి పంపుతున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు.