
సాక్షి, హైదరాబాద్: బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు రచించిన ‘బతుకుపోరు, విలువలు’పుస్తకాన్ని బుధవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. 90కిపైగా పుస్తకాలు రాసి బహుగ్రంథ కర్తగా పేరొందారు.
తత్వశాస్త్రంతోపాటు తెలంగాణ వాస్తవ జీవన చిత్రంపై కథలు, నవలలు, కథానికలు, సాహిత్య విమర్శ, బీసీ సామాజిక వర్గాలపై రచనలు చేశారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కృష్ణమోహన్, ఆంజనేయగౌడ్, గౌరీశంకర్ పాల్గొన్నారు.