
నీళ్లు పడని బోర్లను 10లోగా పూడ్చివేయాలి
పనికిరాని బోరుబావులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నీళ్లు పడని బోర్లను జూలై 10 లోగా పూడ్చివేయాలని పంచాయతీరాజ్,
చెడిన బోర్లుంటే రూ. 50 వేల జరిమానా
అనుమతి లేకుండా బోరు వేస్తే రూ.లక్ష జరిమానా: మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: పనికిరాని బోరుబావులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నీళ్లు పడని బోర్లను జూలై 10 లోగా పూడ్చివేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జూలై 10 తర్వాత గ్రామాల్లో చెడిన బోర్లుంటే సదరు భూ యజమాని మీద రూ. 50 వేల జరిమానా విధించడంతోపాటు కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులు మీనా, వికాస్‌రాజు కమిషనర్ నీతూ ప్రసాద్‌లతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అనుమతి లేకుండా బోరు వేస్తే రిగ్గు యజమానులకు రూ. లక్ష జరిమానా విధిస్తామన్నారు. చెడిపోయిన బోర్లపై గురువారం నుంచి సమగ్ర సర్వే నిర్వహిస్తామని చెప్పారు. గ్రామాల్లో జరిమానా విధించే బాధ్యతను వీఆర్వో, కార్యదర్శి, సర్పంచులకే ఇస్తామన్నారు.