కరీంనగర్ డ్రైనేజి పనుల్లో పేలుడు | blasts in under ground drainage works at karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్ డ్రైనేజి పనుల్లో పేలుడు

Feb 20 2015 1:26 PM | Updated on Sep 2 2017 9:38 PM

కరీంనగర్లో పేలుడు సంభవించింది. సుభాష్ నగర్లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కరీంనగర్లో పేలుడు సంభవించింది. సుభాష్ నగర్లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భూగర్భం గుండా మురుగునీటిని పంపించే పనుల్లో భాగంగా కాలువ తవ్వుతుండగా అడ్డొచ్చిన రాళ్లను జిలెటిన్ స్టిక్స్తో పేల్చడంతో ఒక్కసారిగా మట్టి పెళ్లలు ఎగిరిపడ్డాయి.

అవి కాస్తా అక్కడ ఇద్దరు పిల్లలకు తగలడంతో వారికి గాయాలయ్యాయి. కాగా, పనులు చేసే వాళ్లు ముందుచూపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా పేలుడు సంభవించిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement