అక్టో ‘బీరు’ ఫెస్ట్‌ | Beer Festival in Germany October Month | Sakshi
Sakshi News home page

ఫెస్టి ట్రావెల్‌

Oct 2 2019 8:51 AM | Updated on Oct 4 2019 1:01 PM

Beer Festival in Germany October Month - Sakshi

సిటీ నుంచి పండుగ ప్రయాణాలు షురూ అవుతున్నాయి. అయితే..సెలవులొచ్చాయని స్వంత ఊర్లకూ, చుట్టు పక్కల ఉన్న టూరిస్ట్‌ స్పాట్స్‌కీ వెళ్లొచ్చేయడం లాంటి మనలాంటి మిడిల్‌ క్లాస్‌ టూర్లు కావవి. సిటీ ఇప్పుడు చాలా రిచ్‌ గురూ... అందుకే హాట్‌ హాట్‌ టూర్స్‌ కోసం కాస్ట్‌లీ ఫెస్టివల్స్‌ని వెతుక్కుంటోంది. స్పెయిన్‌లో జరిగే లా టమాటినా ఫెస్టివల్‌ కావచ్చు చైనాలో జరిగే స్నో అండ్‌ ఐస్‌ ఫెస్టివల్‌ కావచ్చు జర్మనీలో జరిగే అక్టోబరు ఫెస్ట్‌ కావచ్చు... సిటీ నుంచి పర్యాటకులు మేము సైతం అంటున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో: మతాచారాల ప్రకారం ఎవరి పండుగలు వారికి ఉంటాయి. అయితే కుల మతాలకు, ప్రాంతాలకు, దేశాలకు కూడా అతీతంగా జరుపుకునే కొన్ని పండుగలు ఉంటాయి. అవి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటైన అక్టోబరు ఫెస్ట్‌కి ఇప్పుడు నగరం నుంచి రాకపోకలు ఊపందుకున్నాయి.  

అక్టో ‘బీరు’ ఫెస్ట్‌
బీరు ప్రియులకూ ఓ నెలుంది. అదే అక్టోబరు. జర్మనీలోని రాయల్‌ వెడ్డింగ్‌ను సాధారణ ప్రజలు సెలబ్రేట్‌ చేసుకోవడం అనే మూలకథతో ముడిపడి ఉన్న ఈ పండుగ 1810లో మొదలై తర్వాత తర్వాత మరిన్ని ఆకర్షణలు అద్దుకుంటూ ప్రపంచమంతా విస్తరించింది. ప్రస్తుతం బీర్, ట్రావెలింగ్‌ల మేలు కలయికగా జరిగే ప్రపంచపు అతిపెద్ద పండుగ ఇది. దీనిని జర్మనీలోని మ్యునిక్‌లో పెద్దయెత్తున నిర్వహిస్తారు. సెప్టెంబరు 21న మ్యునిక్‌ నగర మేయర్‌ చేతుల మీదుగా ప్రారంభమై అక్టోబరు తొలి ఆదివారం వరకూ కొనసాగే 16 రోజుల పండుగకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60–70 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల దాకా నడిచే పండుగలో లైవ్‌ బ్యాండ్స్, ఫుడ్, మ్యూజిక్, డ్యాన్స్‌ఫ్లోర్స్, లోకల్‌ ఆర్టిస్ట్సతో పాటు ఇంటర్నేషనల్‌ బ్యాండ్స్‌ అన్నీ కలగలిసి ఉంటాయి. ఇక్కడ లభించే బీరు మగ్‌ వెయిట్‌ కిలో బరువుంటుందట. దానిలో బీరు పోశాక మరింత బరువనిపించినా.. అదేమీ అక్కడి వారి ఉత్సాహాన్ని ఆపలేదు. పూర్తిగా డ్రాట్‌ బీర్‌ కావడం వల్ల ఎంత తాగినా పెద్దగా మత్తు ఇవ్వదు. స్ట్రాంగ్‌ బీర్స్‌ మాత్రమే కాదు మరే లిక్కర్‌ ఈ పండుగలో
లభించదు.

14 మందిమి వెళ్లొచ్చాం...
ఈ అక్టోబరు ఫెస్ట్‌కి 14 మంది వెళ్లాం. మొత్తం 4 రోజులు ఈ ఫెస్ట్‌లో పాల్గొన్నాం. పనిలో పనిగా మ్యునిక్‌ సిటీ మొత్తం చూశాం. అలాగే పక్కనే ఉన్న ఆస్ట్రియాకి ట్రైన్‌ మీద వెళ్లొచ్చాం. Ðð ఫాల్స్‌ బర్గ్‌ ఫోర్ట్‌ చూశాం. జర్మన్‌ ఆర్కిటెక్చర్‌ అద్భుతంగా ఉంది. చర్చిలు, ప్యాలెస్‌లు చూసి తీరాల్సిందే. తరాలకు అతీతంగా కట్టడాలను కాపాడుకుంటున్నారు. జర్మనీలో ముఖ్యంగా చెప్పుకోదగినంది  కాలుష్యం అసలు ఉండదు. పూర్తిగా  పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌.... అన్నీ ఎలక్రిక్‌ వాహనాలే. మరోవైపు జర్మన్స్‌ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అద్భుతమైన అతిధ్యం ఇచ్చారు. పీస్‌ ఫుల్‌ కంట్రీ. అంత పెద్ద ఈవెంట్‌కి అన్ని దేశాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైనా... ఎక్కడా ఎటువంటి సమస్యా రాకుండా నిర్వహించడం గొప్ప విషయం.  – తులసిరెడ్డి, కోకాపేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement