
నేటి నుంచి ‘అనుపు’ ఉత్సవాలు
భారతీయ సంస్కృతి, కళల పునరుజ్జీ వమే లక్ష్యంగా శుక్రవారం నుంచి ‘అనుపు’ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి తెలిపారు.
సాగర్ వద్ద అనుపు యాంఫీ థియేటర్ వేదికగా ఉత్సవాలు
మూడు రోజులపాటు జానపద, సంప్రదాయ నృత్యాలు
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతి, కళల పునరుజ్జీ వమే లక్ష్యంగా శుక్రవారం నుంచి ‘అనుపు’ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి తెలిపారు. నాగార్జునసాగర్ డ్యామ్ సమీపంలో ఉన్న అనుపు గ్రామంలో మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. ఈ ఉత్సవాల్లో దాదాపు 350 మంది కళాకారులు వేర్వేరు కళారూపాలను ప్రదర్శించనున్నారని గురువారం విలేకరుల సమావేశంలో సుధామూర్తి తెలిపారు. నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణ సమయంలో మహాయాన బౌద్ధానికి సంబంధించిన అనేక అవశేషాలు బయటపడ్డాయని, దాదాపు 1700 ఏళ్ల పురాతనమైన యాంఫీ థియేటర్ (ప్రదర్శన స్థలం) సమీపంలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నామని ఆమె వివరించారు.
శుక్రవారం సాయంత్రం ఉత్సవాలు ప్రారంభమవుతాయని, అనంతరం కూచిపూడి, నాదస్వర ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా భరతనాట్యం, సంగీత, నాటక, జానపద నృత్యాలను కూడా ఏర్పాటు చేశామని, ఇన్ఫోసిస్ ఉద్యోగు లు కూడా ప్రదర్శన ఇవ్వనున్నారని చెప్పారు. మూడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు మధ్యాహ్నం 3.30 గంట ల నుంచి సాయంత్రం ఏడు గంటల వర కూ ఉంటాయని, అందరూ ఆహ్వానితు లేనని తెలిపారు. భారతీయ కళలు, సంస్కృతిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఇన్ఫోసిస్ ఇలాంటి ఉత్సవాలను నిర్వహిస్తోందని, దానిలో భాగంగానే ఈ ఏడాది మార్చిలో గదగ్ (కర్ణాటక)లో లక్ష్మిశ్వర ఉత్సవాలను నిర్వహించామని చెప్పారు.
కర్ణాటకలో ఇలాంటి ఉత్సవాలు దాదాపు వంద వరకూ నిర్వహించాలన్న లక్ష్యంతో ఉన్నామని, అనుపు ఉత్సవాలకు వచ్చే స్పందన ఆధారంగా తెలుగు రాష్ట్రాలోనూ మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. విద్యార్థుల్లో భారతీయ కళలపై ఆసక్తిని పెంచేందుకు, వారిని ప్రోత్సహిం చేందుకు భారతీయ విద్యాభవన్‌తో కలసి పనిచేస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారతీయ విద్యాభవన్ ప్రతినెలా ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ప్రతిభ కలవారికి తాము నిర్వహించే ఉత్సవాల్లో ప్రదర్శనలిచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఇన్ఫోసిస్ హైదరాబాద్ డెవలప్‌మెంట్ సెంటర్ హెడ్ మనీషా సాబూ తదితరులు పాల్గొన్నారు.